09-10-2025 08:39:42 AM
హైదరాబాద్: నేడు చలో బస్ భవన్(BRS Chalo Bus Bhavan) కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో పెంచిన ఆర్టీసీ ఛార్జీలను నిరసిస్తూ చలో బస్ భవన్ కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల నుంచి చలో బస్ భవన్ కార్యక్రమం కొనసాగనుంది. నగరంలోని పలు చోట్ల నుంచి నేతలు ర్యాలీగా బయల్దేరనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao), తలసాని శ్రీనివాస్ యాదవ్, తిగుళ్ళ పద్మారావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సికింద్రాబాద్ నుంచి ర్యాలీగా వెళ్లనున్నారు. మెహదీపట్నం నుంచి మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆర్టీసీ లో బస్ భవన్ కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు బస్ భవన్ లో ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం ఇవ్వనున్నారు.
చలో బస్ భవన్ పిలుపు దృష్ట్యా బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతల ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కేటీఆర్, హరీశ్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు(RTC bus fare hike) మీద నిరసన తెలుపకుండా అణచివేతకు పాల్పడుతుందని బీఆర్ఎస్ ఆరోపించింది. కోకాపేట లోని హరీశ్ రావు ఇంటి చుట్టూ భారీగా పోలీసుల మోహరించారు. కాంగ్రెస్ సర్కార్ పెంచిన బస్సు చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ గురువారం ‘చలో బస్‌భవన్’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పోలీసులు హౌస్ అరెస్టులు చేసిన బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులంతా బస్సులో ప్రయాణం చేస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్ భవన్‌కు చేరుకుంటారని బీఆర్ఎస్ స్పష్టం చేశారు.