calender_icon.png 21 November, 2025 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి

17-08-2024 12:00:00 AM

విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్, ఆగస్టు 16: బస్సులో ప్రయాణించే మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేటీఆర్‌పై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎన్నికల్లో ఓడించి ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్‌ఎస్ నేతల తీరు మారలేదని విమరించారు. మహిళలను కించపరిచిన కేటీఆర్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తగిన మూల్య చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.