17-08-2024 12:00:00 AM
సూర్యాపేట, ఆగస్టు 16 (విజయక్రాంతి): తండ్రిపై ఇతరులు చేస్తున్న దాడిని చూసి సొమ్మసిల్లి బాలిక మృతిచెందిన ఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. కొత్తపల్లి గ్రామానికి చెందిన కాసం సోమయ్యకు, కడారి సైదులు, కడారి సోమయ్య, కాసం కళింగం మధ్య భూతగాదాలున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఆ ముగ్గురు కలిసి కర్రలు, రాడ్లతో సోమయ్యపై దాడికి దిగారు. విచక్షణా రహితంగా దాడి చేస్తుండగా చూసిన సోమయ్య కూతరు కాసం పావని(14) సొమ్మసిల్లి పడిపోయి, మృతిచెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్సై ఐలయ్య తెలిపారు.