calender_icon.png 31 July, 2025 | 10:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

29-07-2025 10:47:07 PM

తంగళ్ళపల్లి (విజయకాంత్రి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్ళపల్లి మండలం మాజీ ఎంపీపీ పడిగల మానస రాజు కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) మంగళవారం పరామర్శించారు. ఇటీవల మాజీ ఎంపీపీ మరిది, బీఆర్ఎస్ నాయకుడు పడిగల అనిల్ అనారోగ్యంతో మృతి చెందారు. కాగా ఆ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ పరామర్శలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోటి ఆగయ్య, మండల అధ్యక్షుడు గజభింకెర్ రాజన్న, కోడి అంతయ్య, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ రమణారెడ్డి, ఇందులో పాల్గొన్నారు.