calender_icon.png 30 July, 2025 | 2:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో కోతుల గుంపు హంగామా

29-07-2025 10:54:13 PM

రైల్వే స్టేషన్ లో తెగి పడిన హైటెన్షన్ వైర్... తప్పిన పెను ప్రమాదం

ఊపిరి పీల్చుకున్న ప్రజలు, రైల్వే సిబ్బంది ప్రయాణికులు..

పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి రైల్వే స్టేషన్(Peddapalli Railway Station)లో కోతుల గుంపు చేసిన హంగామాతో ఉన్నట్టుండి మంగళవారం హై టెన్షన్ పవర్ వైర్ తెగిపడింది. కోతుల హై టెన్షన్ వైర్ పై అటు ఇటు సయ్యాట లాడుతుండగా హై టెన్షన్ వైర్ తెగి ప్లాట్ ఫాంపై ఆగి ఉన్న బొగ్గు గూడ్స్ ట్రైన్  పై పడింది. ఉన్నట్టుండి హై టెన్షన్ పవర్ వైర్ తెగిపాడటంతో రైల్వే స్టేషన్ లోని ప్రయాణికులు, ప్రజలు ఆందోళన చెందారు. తెగిన పవర్ వైర్ గూడ్స్ రైలు పై పడటం వల్ల పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు, ప్రజలతో పాటు రైల్వే ఉద్యోగులు ఊపిరిపీల్చుకున్నారు. దీంతో రైల్వే అధికారులు యుద్ధప్రాతిపదికన తెగి పడిన హై టెన్షన్ వైర్ మరమ్మతు పనులు చేపట్టారు.