calender_icon.png 1 August, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా నల్లవల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవం

29-07-2025 10:42:43 PM

పాల్గొన్న చిమ్ముల గోవర్ధన్ రెడ్డి..

గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లా(Sangareddy District) గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులతో కలిసి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పోచమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దోమడుగు శంకర్, దేవేందర్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్, ఆంజనేయులు, సత్యనారాయణ, మధు, చంద్రారెడ్డి, రవీందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి,సారథి, జయపాల్ రెడ్డి,మల్లేష్, సాయి యాదవ్,గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.