calender_icon.png 22 November, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ ఫోటోకి పాలాభిషేకం

22-11-2025 07:32:58 PM

తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఈరోజు తంగళ్ళపల్లి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కేటీఆర్ ఫోటోకు ఘనంగా పాలాభిషేకం చేశారు. ఆటో డ్రైవర్ల కోసం తన స్వంత నిధులతో ₹5 లక్షల బీమా అందజేయడం పట్ల కేటీఆర్‌కు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు బొల్లి రామ్మోహన్, తంగళ్ళపల్లి ఆటో యూనియన్ అధ్యక్షుడు బండి యోగితో పాటు పెద్ద సంఖ్యలో ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బొల్లి రామ్మోహన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలను గుర్తించి వారిని మరింతగా ఆదుకోవాలని, ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి ₹20 వేల వేతనం అందించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో యూనియన్ సభ్యులు కేటీఆర్ చేసిన సహాయానికి రుణపడి ఉంటామని, ఇది ఆటో డ్రైవర్లకు పెద్ద భరోసా అని వెల్లడించారు.