22-11-2025 07:30:11 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో గల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వెనకాల ఉన్న ప్రభుత్వ భూమిని నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేందుకు కేటాయించాలని కోరుతూ మాజీ సర్పంచ్ మంద అనిత శనివారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కు వినతి పత్రం అందజేశారు. 112 సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమి కబ్జాదారుల చేతిలో ఉందని, ఈ భూమిని కాపాడి పేదలకు కేటాయించాలని వినతి పత్రంలో సబ్ కలెక్టర్ మనోజ్ ను కోరారు.