22-11-2025 07:41:31 PM
50 కిలోల బియ్యం సహాయం..
తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన ముద్దం బుచ్చవ్వ ఇటీవల కారు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నేత అంకారపు రవీందర్ శనివారం బుచ్చవ్వ కుటుంబాన్ని పరామర్శించారు. బుచ్చవ్వ కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆమె పేరున ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటానని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులను ధైర్యపరుస్తూ, టిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల ఆపన్నహస్తంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాఖ్య అధ్యక్షుడు కందుకూరి రామాగౌడ్, వడ్డెర సంఘం మండల అధ్యక్షుడు ఆలకుంట దుర్గయ్య, కుటుంబ సభ్యులు ముద్ద మల్లయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.