17 April, 2026 | 11:46 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

రేవంత్ దోపిడీకి కేటీఆర్ సహకారం

09-04-2025 01:33 AM

ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య అపవిత్ర పొత్తులు కొనసా గుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాన్‌జబ్బలు (ప్రాణమిత్రు లు)గా మారారని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి, విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు, ధరణి భూముల కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈరేస్, ఫాంహౌ జ్ డ్రగ్స్ కేసు వంటి వాటిలో కేసీఆర్ కుటుం బ సభ్యుల ప్రమేయం ఉందని సీఎం రేవంత్‌రెడ్డే మొదట్లో మాట్లాడారని తెలిపారు.

కేటీఆర్‌తో కు మ్మక్కున తర్వాత ఆ కేసులను నీ రుగార్చేందుకు ప్రయత్నిస్తుండటం సిగ్గుచేటన్నారు. అందుకు ప్రతిఫలంగా రేవం త్‌రెడ్డి ప్రభుత్వంతో కలిసి భూముల దోపిడీకి, అవినీతికి కేటీఆర్ సహకరిస్తున్నట్లు ఆరోపించారు. హెచ్‌సీయూ భూములను తెగనమ్మడానికి రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తుంటే.. కేటీఆర్‌పైకి గొడవ చేసినట్లు నటిస్తున్నా లోలోపల పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆరోపించారు.

పార్లమెంటులో వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుపై జరిగిన ఓ టింగ్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎంపీలు కేం ద్రానికి వ్యతిరేకంగా ఓటేసేలా నిర్ణయం తీసుకుంది కూడా వారిద్దరేనని ఆరోపించారు. హైదరాబాద్ ఎమ్మె ల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీచేయకుండా మజ్లిస్‌ను గెలిపించేందుకు సహక రిస్తున్నది రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌లేనని బండి  విమర్శించారు.