21 March, 2026 | 2:15 AM

పోలీస్ సేవలకు అభినందనలు

21-03-2026 12:39 AM

రూ. 53 వేల ఫోన్‌ను మరలా రికవరీ చేసిన ఏడూళ్ల బయ్యారం పోలీసులు

పినపాక మార్చి 20, (విజయక్రాంతి): పినపాక నియోజకవర్గం యువజన కాంగ్రెస్ నాయకులు కోర్స ఆనంద్ మేడారం జాతరకీ వెళ్లగా అక్కడ తన 53 వేల రూపాయలు విలువ చేసే oppo reno 8 pro మొబైల్ దొంగతనం చెయ్యబడింది.

వెంటనే సీ ఈ ఐ ఆర్ పోర్టల్ లో కంప్లైంట్ చెయ్యగా ఏడుళ్ల బయ్యారం CI వెంకటేశ్వర్లు గారు, ఎస్త్స్ర ఐ సురేష్ ప్రత్యేక చొరవ తో ఆంధ్రప్రదేశ్ నెల్లూరు లో ఉన్నట్లు ట్రాక్ చేసి మొబైల్ నీ రికవరి చేసి నేడు కోర్స ఆనంద్ కీ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏడుళ్ళ బయ్యారం  సిఐ వెంకటేశ్వరరావు, ఎస్త్స్ర సురేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యూత్ మాజీ అధ్యక్షులు కోర్స ఆనంద్.