22 May, 2026 | 7:28 PM

ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కుర్మే మహేందర్ నియామకం

22-05-2026 06:34 PM

బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన కురుమే మహేందర్ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజకీయ వారసత్వ కుటుంబానికి చెందిన ఈయన తండ్రి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించి పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ఈయన భార్య అన్నపూర్ణ సర్పంచ్ గా గెలుపొందడం జరిగింది. తనపై నమ్మకంతో పదవీ బాధ్యతలు కట్ట పెట్టడం జరిగిందని భవిష్యత్తులో పార్టీ పార్టీష్టత కోసం కృషి చేస్తానన్నారు. గతంలో ఎంపీటీసీగా గెలిపించి ప్రజలు ఆదరించాలని ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పట్టణ అభివృద్ధి తో పాటు పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు