calender_icon.png 1 January, 2026 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోమార్పేట్ గ్రామ సర్పంచ్‌గా కురుమ పాపయ్య ప్రమాణ స్వీకారం

01-01-2026 02:26:29 AM

ఎల్లారెడ్డి డిసెంబర్ ;31 (విజయ క్రాంతి): గ్రామంలో పలు సమస్యల వల్ల పంచాయతీ సర్పంచ్ ప్రమాణ స్వీకారం వాయిదా పడటంతో మండల పరిషత్ అధికారి తాహెరా బేగం, ఆధ్వర్యంలో, సోమార్పేట్ గ్రామ పంచాయతీ సర్పంచిగా కురుమ పాపయ్య ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతోపాటు ఉప సర్పంచ్,గా మంచే, కిష్టయ్య మరియు వార్డ్ మెంబర్లు పంచాయతీ పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకారం అనంతరం సర్పంచ్ పాపయ్య మాట్లాడుతూ గ్రామంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా కృషి చేస్తానని గ్రామ ప్రజలకు ఎటువంటి ఆటంకం తలెత్తకుండా తన వంతు విధులు నిర్వహిస్తానని అధికారుల సమక్షంలో అభివృద్ధిని కొనసాగిస్తారని ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశానుసారం అభివృద్ధిలో పాలుపంచుకొని గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రకాష్ పంచాయతీ కార్యదర్శి, గ్రామ ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లు పలువురు గ్రామపంచాయతీ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.