01-01-2026 02:24:48 AM
స్వాగతం పలికిన అదనపు కలెక్టర్లు, అధికారులు
నిజామాబాద్, డిసెంబర్ 31 : (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా ఇలా త్రిపాఠి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకున్న జిల్లా కలెక్టర్ ను అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ సాదరంగా స్వాగతం పలికారు. నేరుగా తన చాంబర్ కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కలెక్టర్ ను పలువురు శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి పరిచయం చేసుకున్నారు. కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, ఉద్యోగ సంఘాల నాయకులు కలెక్టర్ కు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు
జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్, డిసెంబర్ 31 (విజయ క్రాంతి): నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి శుభాకాంక్షలు ప్రకటించారు. 2026 ఏడాది ప్రతి ఒక్కరికి శుభాలను చేకూర్చాలని, అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో కొత్త సంవత్సరంలో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తూ జిల్లాను ప్రగతి బాటలో పయనింపజేసేందుకు కలిసికట్టుగా కృషిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.