calender_icon.png 9 May, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూసుకుంట్ల రాజగోపాల్ రెడ్డిని విమర్శించే స్థాయి కాదు...

08-05-2025 08:44:14 PM

శిలాఫలకాలు ఎక్కడ కూల్చలేదు..

కమిషన్లకు కక్కుర్తి పడి నాసిరకంగా క్యాంప్ కార్యాలయం కట్టించి, ప్రజాధనాన్ని జేబులో వేసుకున్నావ్..

ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి..

మునుగోడు (విజయక్రాంతి): కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని విమర్శించే స్థాయి కాదని ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పిఎసిఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేము చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా అభివృద్ధి ఏమి చేయలేదంటూ,  మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేసిన నిరాధారమైన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.

కోటి 60 లక్షల వ్యయంతో  నాణ్యంగా నిర్మించాల్సిన అధికారిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కమిషన్లకు కుక్కర్తి పడి నాసిరకంగా నిర్మించారంటూ, నిర్మించి సంవత్సరం తిరగకముందే  కిటికీలు దర్వాజాలు పాడై, స్లాబ్ నుంచి నీరు కారుతూ బిల్డింగ్ అంతా నేర్రలు బారడంతో... ప్రజా సమస్యలు చర్చించే వేదిక ఇలా ఉండొద్దని తన సొంత డబ్బులతో అధికారిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆధునికరిస్తే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు.

గత పది ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో మునుగోడు అభివృద్ధికి నోచుకోలేదని, ప్రజలిచ్చిన పదవిని ఆ ప్రజల అభివృద్ధి కోసం త్యాగం చేసిన గొప్ప మనిషి రాజగోపాల్ రెడ్డి గారని అన్నారు. రాజీనామా దెబ్బతో ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి అభివృద్ధి చేయించిన ఘనత రాజగోపాల్ రెడ్డి గారిదన్నారు. ఆయన రాజీనామాతో గట్టుప్పల్ మండల్ ఏర్పాటు, చండూరు రెవిన్యూ డివిజన్ ఏర్పాటు, ప్రతి గ్రామానికి అభివృద్ధి నిధులు తీసుకొచ్చిన విషయం మరువొద్దన్నారు. టిఆర్ఎస్ పాలనలో మంజూరై పనులైన వాటికి  బిల్లులు చెల్లించకపోతే  ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిల్లులు ఇప్పించి అభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్న ఘనత రాజగోపాల్ రెడ్డి గారిదని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మునుగోడుని సర్వతోముకాభివృద్ధి అభివృద్ధి పరచాలని అనునిత్యం తపిస్తున్న వ్యక్తిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

టిఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో చేపడుతున్న రిజర్వాయర్లకు నీటిని ఎక్కడ నుంచి తరలించాలని ఆలోచన కూడా చేయకుండా పనులను పెండింగ్ పెట్టారని... ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక  ఏదుల రిజర్వాయర్ నుండి మునుగోడు నియోజకవర్గంలోకి నీరు వచ్చే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించి 1800 కోట్ల నిధులను మంజూరు చేయించిన ఘనత రాజగోపాల్ రెడ్డి దేనని మరువద్దన్నారు. బ్రాహ్మణ వెళ్ళాంల ప్రాజెక్టు నుండి మునుగోడు మండలం సస్యశ్యామలం చేయడానికి రిటైర్డ్ ఇంజనీర్లతో పలుమార్లు సమీక్ష నిర్వహించి మునుగోడు మండలాన్ని సస్యశ్యామలం చేయడానికి బృహత్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని... ఒక మునుగోడు మండలమే కాకుండా వర్షపు నీటిని ఒడిసి పట్టి చెరువులకు మళ్ళించేలా, ఫీడర్ ఛానల్ ను చెరువులను అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తున్నారని గుర్తు చేశారు.

ఎప్పుడో గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని 3.5 మీటర్ల ఉన్న రోడ్డు వెడల్పును, 5.5 మీటర్లకు మార్చి ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే విధంగా ముఖ్యమంత్రిని మంత్రులను ఒప్పించిన ఘనత రాజగోపాల్ రెడ్డి గారిదన్నారు. విద్య వైద్యం సాగునీరు త్రాగునీరు రోడ్లు విద్యుత్తు అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే మునుగోడును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అనునిత్యం  కష్టపడుతున్న రాజగోపాల్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు, మీ పాలనలో ప్రజా సంక్షేమ పథకాలన్ని కూడా గులాబీ కండువ వేసుకున్న వాళ్ళకి ఇచ్చారు.

ప్రజా ప్రభుత్వంలో పార్టీలతో సంబంధం లేకుండా నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో రాజగోపాల్ రెడ్డి పనిచేస్తున్నారు. పదవి పోగొట్టుకొని బాధలో మాట్లాడుతున్న మీరు మరోసారి రాజగోపాల్ రెడ్డిపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కుంభం చెన్నారెడ్డి, హైమద్, రాష్ట్ర నాయకులు వట్టికోటి శేఖర్, పట్టణ అధ్యక్షుడు ఆరేళ్ల సైదులు, మాజీ ఎంపిటిసి పందుల భాస్కర్, స్థానిక మాజీ సర్పంచ్ లు మీర్యాల వెంకన్న, నడింపల్లి యాదగిరి, మాదగొని రాజేష్ గౌడ్, సీనియర్ నాయకులు ముచ్చపోతుల శ్రీనివాస్, మందుల బీరప్ప, నకిరికంటి యాదయ్య, గోపగోని పాపయ్య, జెనిగల ముత్యాలు, బుడిగపాక కాశయ్య, మాజీ ఉప సర్పంచ్ పోలగొని ప్రకాష్, జంగిలి నాగరాజు ఉన్నారు.