08-05-2025 08:57:18 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్(Minister Ponnam Prabhakar Goud) జన్మదిన వేడుకలు గురువారం ఖమ్మం జిల్లా ఆర్టిఏ నెంబర్ గజ్జెలి వెంకన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ రథసారథి శ్రీ పువ్వల దుర్గాప్రసాద్, ఖమ్మం జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు ఖమ్మం పిసిసి నెంబర్ శ్రీ పుచ్చకాయల వీరభద్రం, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీ దొబ్బల సౌజన్య, సేవాదళ్ అధ్యక్షులు శ్రీ గౌస్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఎస్కే హుస్సేన్, కాంగ్రెస్ నాయకులు సాదు రమేష్ రెడ్డి, శ్రీ కమ్మర్తపు మురళి, ఓ బీసీ సెల్ ఖమ్మం అధ్యక్షులు డాక్టర్ చోటే బాబా, శ్రీ బాణాల లక్ష్మణ్, ఓబీ సెల్ ఉపాధ్యక్షులు శ్రీ మాదారపు హరినాథ్, జిల్లా ఓబీసీలు కార్యదర్శి శ్రీ బొమ్మిడి శ్రీనివాస్, కమతం రామకృష్ణ, జెర్రిపోతుల అంజని తదితరులు పాల్గొన్నారు.