calender_icon.png 21 August, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో కనీస సౌకర్యాలు కరువు

21-08-2025 12:25:58 AM

ఆకస్మిక తనిఖీకి వచ్చిన కలెక్టర్ కు వివరించిన సిబ్బంది 

మేడ్చల్, ఆగస్టు 20(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా షామీర్పేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కనీస సౌకర్యాలు లేక రోగులతో పాటు సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం శామీర్ పేట్ మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టరు మను చౌదరి తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టరు  ఆసుప్రత్రిలో ఏమేమి సమస్యలున్నాయని మెడికల్ ఆఫీసర్ ను అడుగగా, పై కప్పు నుండి వాటర్ లీకేజీ, బెడ్స్ కొరత, వాష్ రూమ్స్ నిర్వహాణలో లేవని, డ్రెనేజీ సమస్యలు ఉన్నాయని  తెలిపారు.

కలెక్టర్ స్పందిస్తూ ఆసుపత్రి భవనం పైన నీరు లీకేజ్ కాకుండా రేకులతో షెడ్ ఏర్పాటు చేయాలని,  డ్రైనేజీ, బెడ్స్,  వాష్ రూమ్స్ నిర్వహాణకు అవసరమైన నిధులు ఇస్తానన్నారు. ఫీవర్ సర్వే జరుగుతుందా అని, డెంగూ కేసులు ఎన్ని ఉన్నాయని కలెక్టర్ అడుగగా, ఈ నెలరెండు డెంగూ కేసు లు నమోదు అయ్యాయని, వారికి చికిత్స అందిస్తున్నామని మెడికల్ ఆఫీసర్ తెలిపారు.

ల్యాబ్, లేబర్ రూం, స్టోర్ అన్ని విభాగాలను కలెక్టర్ తిరిగి పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవ లు అందించాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో శామీర్ పేట్ తహాసీల్దారు యాదగిరి రెడ్డి, డిసిహెచ్ ఎస్ సునీత, మెడికల్ ఆఫీసర్ శివకిరణ్, మెడికల్ సిబ్బంది  పాల్గొన్నారు.