06-09-2025 12:44:14 PM
ఖమ్మంపల్లిలో ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు
ముత్తారం తాసిల్దార్ మధుసూదన్ రెడ్డి
ముత్తారం,(విజయక్రాంతి): మండలంలో ప్రభుత్వ భూములను(Government land) అక్రమంగా ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ముత్తారం తాసిల్దార్ మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమి (617) సర్వే నెంబర్ లో కొంతమంది ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని స్వాధీనం చేసుకున్నట్లు తమకు ఖమ్మంపల్లి గ్రామానికి చెందినవారు ఫిర్యాదు చేశారని. అ భూమి లో శనివారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ ర్లు సిబ్బందితో కలిసి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయించామని తాసిల్దార్ తెలిపారు. ఎవరైనా గ్రామంలో ప్రభుత్వ భూములు పట్టాలు లేకుండా, అనుమతి పత్రాలు లేకుండా ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని తాసిల్దార్ హెచ్చరించారు.