6 August, 2026 | 2:48 AM

ఇది మడుగు కాదు... ప్రదాన రాహదారే

23-08-2024 12:59 PM

గద్దలపల్లి లో ప్రదాన రహదారి పై ఏర్పడిన మడుగు... ఇబ్బందులు పడుతున్న ప్రజల

మంథని(విజయక్రాంతి): అవును మీరు చూస్తున్నది మడుగు కాదు.... ప్రదాన రహదారే... నమ్ముతలేరా... అయితే మంథని మండలంలోని గద్దలపల్లి (దర్మారం)లో వెళ్లాలి. గ్రామంలోకి వేళ్లే ప్రదాన రహదారిపై ఇటీవల కురిసిన వర్షాలకు నీళ్లు ఎటుపోక పోవడంతో అ నీళ్లు ఇలా రోడ్డుపై ఉండటంతో పెద్ద మడుగు తయారైంది. దీంతో రోజు  ఆ గ్రామ ప్రజలు ఈ రోడ్డుపై ప్రయనించాలంటే, ఈ పడుగు నీటిలో నుంచి పోవాల్సిందే. ఈ నీటిని తరలించాలని గ్రామస్తులు ఎన్ని సార్లు అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పాలనలో ప్రజల పరిస్థితి ఎలా ఉందో ఈ మడుగును చూస్తే అర్థం అవుతుంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఈ మడుగులోని నీళ్లను తరలించి,  గ్రామస్తులు ఇబ్బందులూ తీర్చాలని వేడుకుంటున్నారు.