27-10-2025 01:25:25 AM
నవంబర్ 1లోపు రూ.900 కోట్లు చెల్లించాలి
-లేకుంటే 3నుంచి కాలేజీలు బంద్
-బకాయిలు అడిగినప్పుడే కాలేజీల్లో విచారణలా?
-ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్
హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వానికి ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య మరోసారి అల్టిమేటం జారీ చేసింది. నవంబర్ 1లోపు రూ.900 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయకుంటే అదే నెల 3నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్‌తో సహా ప్రొఫెషనల్, డిగ్రీ, పీజీ కాలేజీలన్నీ బంద్ చేస్తామని ప్రకటించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల అంశంపై ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య జనరల్‌బాడీ సమావేశాన్ని ఆదివారం గచ్చిబౌలిలో నిర్వహించారు.
ఈ సందర్భంగా సమాఖ్య చైర్మన్ రమేష్ మాట్లా డుతూ.. భయపెడితే ఊరుకోమని, బకాయిలు అడిగినప్పుడే తమ కాలేజీల్లో విచారణ చేపడుతున్నారని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో కాలేజీలను నడిపే పరిస్థితుల్లో లేమని, ప్రభుత్వం తమకు ఇస్తామన్న రూ.1200 కోట్లలో కేవ లం రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేసిందని తెలిపారు. నవంబర్ 1లోపు మిగిలిన రూ. 900 కోట్లను విడుదల చేయాలని, లేకుంటే కాలేజీలు నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించారు. అలాగే మిగిలిన రూ.9 వేల కోట్ల బకాయిలపై కూడా ప్రభుత్వం ఓ జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే నవంబర్ 10 లోపల 2 లక్షల మంది అధ్యాపకులు, యాజమాన్యాలతో సమావేశం, ఆతర్వాత 10 లక్షల మంది విద్యార్థులతో భారీ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా తమ ఈ నిరసన కార్యక్ర మాలు ఉంటాయని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అడిగినప్పుడే ప్రభుత్వ ఎంక్వు లు చేస్తున్నారని, పెండింగ్ బకాయిల విషయంలో మంత్రులు తమకు సహకరించడం లేదని, ఏ ఒక్క పోలీసును కూడా కాలేజీలోకి అనుమతించబోమని తేల్చి చెప్పారు.
ఈ 2025 విద్యాసంవత్సరానికి సం బంధించిన రీయింబర్స్‌మెంట్ నిధులు వచ్చే ఏడాది జూన్‌లోపు చెల్లించాలని కోరా రు. కొత్త కోర్సులకు సంబంధించిన అనుమతులను జారీ చేయాలన్నారు. తాము చెప్పి న కాలేజీలకే పెండింగ్ బకాయిలు విడుదల చేస్తున్నారని తమపై కొంత మంది అధికారులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో సమాఖ్య సెక్రటరీ జనరల్ కేఎస్.రవికుమార్, ట్రెజరర్ కే.క్రిష్ణారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కే.సునీల్ కుమార్, సమాఖ్య నాయకులు కే.రాందాసు తదితరులు పాల్గొన్నారు.