calender_icon.png 18 November, 2025 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాకతీయ నగర్ రామాలయంలో లక్ష దీపోత్సవం ఘనంగా

18-11-2025 06:15:16 PM

కార్తీక మాసం సోమవారం సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిట 

రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలో ఉన్న కాకతీయ నగర్ శ్రీ రామాలయం వద్ద సోమవారం లక్ష దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీ మాధవానంద స్వామి ఆశీస్సులతో నిర్వహించిన ఈ లక్ష దీపోత్సవంలో భక్తులు దీపాలను వెలిగించి క్షేమసమృద్ధులు కోరి ప్రార్థనలు చేశారు. వేలాది దీపాల కాంతులతో ఆలయం స్వర్ణ కాంతులు విరజిమ్ముతూ దగదగలా వెలుగులు విరజిమ్మింది. ఆలయ కమిటీ సభ్యులు, వేదపండితులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్తీక మాసంలో దీపదానం మహాపుణ్యకరమని పండితులు పేర్కొన్నారు.