18-11-2025 06:12:16 PM
ముకరంపుర (విజయక్రాంతి): 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములలో భాగంగా మంగళవారం కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థులకు పాటల పోటీలను నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కెప్టెన్ డాక్టర్ బి.మధుసూదన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి ఎ.సరిత, గాయకులు వొల్లాల శ్రీనివాస్, బుర్ర సతీష్, డి శేఖర్, జి.మల్లేశం, డప్పురాజేశం, డిప్యూటీ గ్రంథపాలకులు వి.అర్జున్, సహాయ గ్రంథపాలకరాలు జి. సరిత, జె.గౌతమి, సిబ్బంది శ్రీ. కె. మల్లయ్య, పి. నాగభూషణం, సుమన్, పవన్, శశి, రవి, తదితరులు పాల్గొన్నారు.