calender_icon.png 18 November, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ కార్యదర్శి నరేందర్ రెడ్డిని సన్మానించిన జిల్లా కలెక్టర్

18-11-2025 06:28:54 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలంలోని పాపక్కపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి పోరెడ్డి నరేందర్ రెడ్డిని జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నరేందర్ రెడ్డి పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న ఆ గ్రామంలో మైనర్ బాలికను వివాహం చేసుకున్న వారిపై పోక్సో కేసు పెట్టడం అభినందనీయమన్నారు. గ్రామాలలో పనిచేస్తున్న పంచాయతీ సెక్రెటరీ ఇలాంటివి ఎదురైనప్పుడు అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిడిలకు లొంగకుండా, చట్ట పరిధిలో నడుచుకోవాలన్నారు. మైనర్ లకు పెళ్లి చేయడం అనేది చట్టరీత్యా నేరం అన్నారు. ఈ విషయాన్ని ఆయా గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు పో రెడ్డి నరేందర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.