18-11-2025 06:48:21 PM
ఏటూరునాగారం (విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మాదకద్రవ్యాల ప్రతిభంధక విభాగం ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ స్థాపించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కమిషనరేట్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ వారి ఆదేశాల మేరకు "మాదకద్రవ్యాల నిరోధకం పై విద్యార్థులు, అధ్యాపకులచే సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమంను నిర్వహించటం జరిగింది.
"ఈకార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్, బి. రేణుక అధ్యక్షత వహించగా రిసోర్స్ పర్సెన్స్ గా ఎ.శ్రీనివాస్ (సి ఐ), రాజేష్ కుమార్(ఎస్ ఐ), టివి.సూరి(ఎస్ ఐ మంగపేట), బాలుర హాస్టల్ వార్డెన్ వెంకటేష్, హాజరై మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యాంటీ డ్రగ్స్ సెల్ కన్వీనర్ సిహెచ్. వెంకటయ్య,కనీస్ ఫాతిమా, సంపత్, రమేష్, రాజశేఖర్ భావన, శ్రీధర్, భాస్కర్, భారతి, శ్రీకాంత్ అధ్యాపకేతర బృందం, పోలీసు సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.