18-11-2025 06:17:23 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి కమిషనర్ విజయ్ కుమార్ కు మున్సిపాలిటీలో ఉపాధి హామీ పనులు చేపట్టి ఉపాధి కల్పించలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు కనికరపు అశోక్, దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. లక్షెట్టిపేట మున్సిపాలిటిగా ఏర్పడక ముందు ప్రజలకు ఉపాధి హామీ పనుల ద్వారా పని ఉండేదని, కొంత ఇంటి ఖర్చుల కొరకు డబ్బులు ఉండేవి అన్నారు.
మున్సిపాలిటీ తర్వాత మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలలో ప్రజలకు ఉపాధి హామీ పనులు లేక ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేకుండా పోయిందన్నారు. ప్రజలు ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కావున కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మున్సిపాలిటీలో కూడా ఉపాధి హామీలు పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గంధం రాజలింగు, సీఐటీయూ మండల కన్వినర్ శోభ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.