calender_icon.png 18 November, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం అమలుకు ప్రణాళికను సిద్ధం చేయాలి

18-11-2025 06:35:18 PM

జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్

గద్వాల: ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం అమలుకు ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నందు పీఎం ధన్ ధాన్య కృషి యోజన కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, మత్స్య, ఆర్టికల్చర్, జిల్లా సహకార సంస్థ అధికారులతో ఆయా శాఖలలో కొనసాగుతున్న ప్రస్తుత అభివృద్ధి పనులు,పథకాల అమలు గురించి అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయం,అనుబంధ రంగాల్లో రైతులు సాంకేతికతను వినియోగిస్తూ మెరుగైన ఆదాయాన్ని పొందేందుకు  ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన లక్ష్యమని  తెలిపారు.

జిల్లాలో ఆ పథకం అమలుకు సంబంధిత శాఖల అధికారులు తమ తమ శాఖలకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు.వ్యవసాయానికి సంబంధించిన కిసాన్ సమ్మాన్ నిధి,కిసాన్ క్రెడిట్ కార్డ్,సహజ మరియు సేంద్రీయ వ్యవసాయం, వ్యవసాయ యంత్రాలు తదితర  పథకాల సహాయంతో రైతుల ఆదాయం,పంట ఉత్పాదకత, సుస్థిర వ్యవసాయం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అన్నారు.రైతు ఉత్పత్తి దారుల సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ధన్ ధాన్య కృషి యోజన పథకం అమలుకు దోహద పడుతుందని తెలిపారు.

ఉద్యానవనం శాఖ 2 ,సహకార శాఖ 2,డీఆర్డీఏ 1 రైతు ఉత్పత్తి దారుల సంస్థలను ఏర్పాటుచేసి వారికి రుణం మంజూరు చేసి,ఆ రుణం ద్వారా వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయించవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. సాయిల్  హెల్త్ కార్డ్స్ ఉన్న రైతులకు వాటి ఉపయోగాలు వివరించి,సరైన వినియోగంపై శిక్షణ ఇచ్చి గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు కిసాన్ విజ్ఞాన్ కేంద్రం, వ్యవసాయ శాఖల సమన్వయంతో నిర్వహించాలని సూచించారు.రైతులు తినగల నూనె పంటలు మరియు ఆయిల్ పామ్ వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలని ఉద్యాన శాఖకు సూచించారు.

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ద్వారా కొత్త ధాన్య నిల్వ యూనిట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కో ఆపరేటివ్ అధికారులకు ఆదేశించారు. మత్స్యశాస్త్ర శాఖకు సంబంధిత ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన,ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ-యోజన, కిసన్ క్రెడిట్ కార్డు అంశాలను పూర్తి వివరాలతో యాక్షన్ ప్లాన్ ను సమర్పించాలని ఆదేశించారు. పశుసంరక్షణలో పీపీఆర్, ఎఫ్ఎండీ,బ్రూసెల్లా వంటి రోగాలను నిరోధించడం,పాలు, జెనిటిక్ అభివృద్ధి,మౌలిక సదుపాయాలు,శిక్షణ,ఆర్థిక మద్దతు ద్వారా రైతుల ఆదాయం పెంపును సాధించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని పశు సంవర్థకశాఖ అధికారికీ ఆదేశించారు.

ప్రధానమంత్రి ధన‑ధాన్య కృషి యోజన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్కీమ్ కింద 45 యూనిట్లను గుర్తించి, ఇండస్ట్రీస్,డీఆర్డీఏ సమన్వయంతో వాటిని గ్రౌండింగ్ చేయాలన్నారు.ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్,అడిషనల్ డిఆర్డిఓ శ్రీనివాసులు,ఏడిఏ సంగీతలక్ష్మి , మార్కెటింగ్ అధికారిని పుష్పమ్మ, ఉద్యానవన శాఖ అధికారి అక్బర్,పరిశ్రమల శాఖ మేనేజర్ రామలింగేశ్వర గౌడ్, ఎల్డిఎం శ్రీనివాసరావు, మత్స్యశాఖ అధికారిని షకీలాబాను,కోపరేటివ్ అధికారి శ్రీనివాసులు, పశుసంవర్ధక అధికారి వెంకటేశ్వర్లు,నీటి పారుదలశాఖ అధికారి శ్రీనివాసులు,కేవీకే శాస్త్రవేత్త సురేష్,నాబార్డ్ డియం మనోహర్ రెడ్డి,ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.