calender_icon.png 18 November, 2025 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీ కేంద్రాల్లో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ

18-11-2025 06:30:47 PM

కాటారం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం సర్కిల్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో మంగళవారం మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేపట్టారు. మహాదేవపూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిణి రాధిక ఆదేశాల మేరకు అన్ని అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులు, గ్రామస్తుల చేత ప్రతిజ్ఞ కార్యక్రమాలు కొనసాగాయి. మాదక ద్రవ్యాల నిరోధకం పై జరుగుతున్న పోరాటంలో అందరూ క్రియాశీలక పాత్ర పోషించాలని అంగన్వాడీ టీచర్లు ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. గంగారం సూపర్వైజర్ వీణ, అంగన్వాడి టీచర్లు ముసుకుల శ్రీలత రెడ్డి, కమలాదేవి, ఓడిపిలవంచ, దేవరాం పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.