calender_icon.png 27 July, 2025 | 9:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసంపూర్తి ‘డబుల్’ ఇళ్లకు 5 లక్షలు

27-07-2025 12:41:57 AM

- వచ్చే నెల 15లోగా ఇండ్ల కేటాయింపు పూర్తి చేయాలి

- ఇందిరమ్మ ఇండ్ల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్

- వరంగల్ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు

- రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఇండ్ల స్థలాలు లేని అర్హులైన లబ్ధిదారులకు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వచ్చే నెల 15వ తేదీలోగా కేటాయించాలని, ఇందుకు అర్హులైన లబ్ధిదారుల ఎంపికను వెంటనే చేప ట్టాలని రాష్ర్ట రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖమంత్రి   పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తిచేసుకోవడానికి ప్రభుత్వమే లబ్ధిదారులకు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తుందని ప్రకటించా రు.

సచివాలయంలో శనివారం వరంగల్ నగర అభివృద్ధిపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి వరంగల్ విమానాశ్ర యం, మెగా టెక్స్‌టైల్ పార్క్, భద్రకాళి దేవస్థానం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్‌రింగ్ రోడ్డు, రైల్వే తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు దరఖాస్తు ఎప్పుడు చేసుకున్నారనేది ముఖ్యం కాదని, నిరుపేదలకు ఇండ్లు ఇవ్వడమే ప్రధానమన్నారు.

ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా కూడా వాటిని పరిశీలించాలని కలెక్టర్లకు సూచించారు. శ్రావణ మాసం మొదలైన నేపథ్యంలో త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు కూడా ఉంటాయని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఫిర్యాదులు, సందేహాలు, సమస్యల పరిష్కారానికి హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్యాలయంలో త్వరలో ఒక టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేస్తామని తెలపారు.

రూ.4,170 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థ 

రూ.4,170 కోట్లతో 2057 నాటికి జనాభాను దృష్టిలో పెట్టుకొని వరంగల్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలన్నారు. భద్రకాళి ఆలయ మాడవీధులతోపాటు కల్యాణ మండపం, పూజారి నివాసం, విద్యుత్ అలంకరణలను వచ్చే దసరా నాటికి అందుబాటు లోకి తెచ్చేవిధంగా చూడాలన్నారు. అమ్మవారి ఆలయ అభివృద్ధి పనుల పర్యవేక్షణకు తానే స్వయంగా వస్తానని చెప్పారు. రోప్‌వే, గ్లాస్‌బ్రిడ్జితో సహా అన్ని పనులు  వచ్చే డిసెంబర్ కల్లా పూర్తిచేయాలన్నారు. భద్రకాళి చెరువు ప్రాంతంలో ఇంతవరకు 3.5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించామని, రూ. 2.06 కోట్ల రూపాయిల మట్టిని విక్రయించామని అధికారులు తెలిపారు. 

సీఎం రేవంత్‌రెడ్డి ప్రకట నకు అనుగుణంగా వరంగల్ జిల్లాలో క్రికెట్ స్టేడియానికి అవసరమైన భూమిని గుర్తించాలని సూచించారు. సమావేశంలో ఎంపీ బలరాం నాయ క్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కే నాగరాజు, గండ్ర సత్యనారాయణ, నాయని రాజేందర్, ఎమ్మెల్సీ లు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, అంజిరెడ్డి, బండ ప్రకాశ్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ సమగ్రాభివృద్ధికి చర్యలు

వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణం గా అధికారులు పని చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశిం చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ నగరాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం పనిచేయాలన్నారు.

వరంగల్ ప్రాంత చిరకాల స్వప్నమైన మాము నూరు ఎయిర్‌పోర్ట్ కల త్వరలో సాకా రం కానుందని, ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన భూ సేకరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భూ సేకరణకు రూ.205 కోట్లు కేటాయించామని, గ్రీన్ ఛానల్ ద్వారా నిధు లు విడుదల చేస్తామన్నారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్‌కు సంబంధించి రాజీవ్ గాంధీ టౌన్ షిప్‌లో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద 1398 మంది లబ్ధిదారులను గుర్తించి 863 ప్లాట్‌లు కేటాయించామని తెలపారు.