30 June, 2026 | 7:51 AM

క్వార్టర్స్‌లో లక్ష్యసేన్

07-06-2024 01:42 AM

జకర్తా: భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సూపర్ సిరీస్ టోర్నీ పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్ గురువారం 21 21 కెంటా నిషిమొటో (జపాన్)పై సునాయాస విజయం సాధించాడు. 45 నిమిషాల పాటు జరిగిన పోరులో లక్ష్యసేన్ ఎక్కడా ప్రత్యర్థికి అవకాశమివ్వలేదు. లక్ష్యసేన్‌కు 2 నిషిమొటోపై మంచి రికార్డు ఉంది. తాజా విజయంతో ఆ సంఖ్యను 3 మార్చాడు. క్వార్టర్స్‌లో లక్ష్యసేన్ డెన్మార్క్‌కు చెందిన ఆండర్స్ ఆంటోన్‌సెన్‌తో తలపడనున్నాడు. మరో సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్ 10 17 వితిద్‌సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం చవిచూశాడు. మహిళల డబుల్స్ విభాగంలో గాయత్రి గోపిచంద్ జాలీ ద్వయం 21 19 19 మత్సుమొటోేొవకానా నగహర (జపాన్), అశ్విని జోడీ 21 19 21 బేక్ హీలీ జంట చేతిలో పరాజయం చవిచూశాయి.