23-04-2025 12:00:00 AM
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సీ.నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
యాచారం ఏప్రిల్ 22: ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలకు చెక్ పెట్టవచ్చని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మంచాల, యాచారం మండలాల్లో భూభారతి నూతన చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన భూభారతి చట్టం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని వారు గుర్తు చేశారు.
భూ సమస్య గురించి రైతులు దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి అట్టి సమస్యను పరిష్కరి స్తారని చెప్పారు. అందుకోసం క్షేత్రస్థాయిలో గ్రామస్థాయిలో అధికారిని నియ మించి నిర్దేశిత సమయంలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. భూ సదస్సుకు ఆయా మండలాల్లో పలువురు రైతులు పాల్గొన్ని తమ సమస్యలను అధికారులకు విన్నవించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆమ్రపాలి ఆర్డీవో అనంతరెడ్డి , ఎమ్మార్వో అయ్యప్ప, ఎంపీడీవో నరేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మార్కెట్ చైర్మన్ గుర్నాథ్ రెడ్డి, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు