calender_icon.png 17 August, 2025 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన,హోమం

17-08-2025 07:19:29 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని చిర్రకుంట గ్రామంలో సోమవారం చేపట్టే అభయాంజనేయ స్వామి ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాగంగా ఆదివారం వేద పండితులు దుధిల మనోహర్ శర్మ ఆధ్వర్యలో నిర్వహించిన మొదటి రోజు గణపతి పూజ, పుణ్యవచనం, అఖండ దీపారాధన, నవగ్రహ, పూజ హోమం  అత్యంత భక్తిశ్రద్ధలతో చేపట్టారు.

భాజపా సీనియర్ నాయకుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావు, వారి కుటుంబ సభ్యులు నక్క ఉమేష్ యాదవ్ దంపతులు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం ఆంజనేయ స్వామి, ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ప్రతిష్టాపన అనంతరం అన్నదాన చేపట్టడం జరుగుతుందని, అందులో ప్రతి భక్తుడు భాగస్వామమై స్వామివారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు.