17-08-2025 07:36:57 PM
మేడిపల్లి: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల క్రాంతి కాలనీ లో కుండ పోచమ్మ తల్లి ఆలయం వద్ద గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ గోకుల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ వేడుకల్లో పాల్గొన్న చిన్నారులు చిన్ని కృష్ణుడు, గోపికమ్మ వేషధారణలో అలరించారు. యాదవ సంఘం నాయకులు చిన్నారులతో పాటు ఉట్టి కొడుతూ సందడి చేశారు.
నేటి తరం యువకులకు రేపటి తరం చిన్నారులకు మన సంస్కృతి సంప్రదాయాలు, శ్రీకృష్ణ పరమాత్ముని లీలలు, గోకులాష్టమి విశిష్టతను తెలపడానికి ఎటువంటి వేడుకలు ఎంతో దోహదపడతాయని, శ్రీకృష్ణ పరమాత్ముడు చిన్నతనం నుంచి అనేక లీలలు చూపించాడని ఆయన చూపిన ప్రతి లీలలు ఏదో ఒక పరమాత్మ దాగి ఉండి లోకానికి మేలు చేసిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో పయనిస్తూ గోమాతను పూజించాలని, మన సంస్కృతికి అద్దం పట్టే పండుగలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. గోకుల యాదవ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రతినిధులు తెలిపారు.