17-08-2025 07:32:30 PM
మంథని,(విజయక్రాంతి): తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా నాలుగవ మహాసభలు ఆదివారం మంథనిలో ఘనంగా నిర్వహించారు. పాత పెట్రోల్ బంక్ నుండి ఫ్రెండ్స్ క్లబ్ వరకు ర్యాలీ కోలాటాల ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర, జిల్లా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జనగామ రాజమల్లు పాల్గొని మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల మహాసభలు మంథని పట్టణంలో ఒక పండుగలాగా కార్మికులు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. అనేక సంవత్సరాలుగా మున్సిపల్ కార్మికులు సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పోరాడుతూ అనేక సమస్యలను పరిష్కరించుకున్నారని, రాబోయే రోజుల్లో జిల్లాలో అన్ని మున్సిపాలిటీల కార్మికులు ఐక్యంగా నిలబడి తమ సమస్యల పరిష్కారం కొరకు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.