calender_icon.png 7 May, 2025 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు ఢీకొని విద్యార్థి మృతి

23-04-2025 12:00:00 AM

చేవెళ్ల, ఏప్రిల్ 22: బైక్‌ను కారు ఢీకొట్టడంతో విద్యార్థి చనిపోయాడు.  మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మొయినాబాద్ పోలీసుల వివరాల ప్రకారం... నంద్యాల జిల్లా మిడ్తూరు మండలం పీరుసాహెబ్ పేటకు చెందిన ఆర్. చిన్న వీర రెడ్డి కుమారుడు వినయ్ కుమార్(19) సన్ సిటీలో నివాసం ఉంటూ చిల్కూరు పరిధిలోని కేఎల్ యూ యూనివర్సిటీలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. 

మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటలకు వినయ్ కుమార్ తన స్నేహితులతో కలిసి బ్పై సన్ సిటీ నుంచి గండిపేటకు వెళ్తున్నాడు. మెలుహా స్కూల్ సమీపంలోకి రాగానే..  మహీం ద్రా ఎక్స్ యూవీ 500 (ఏపీ 28 డీపీ6676) కారు బైకును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో వినయ్ కుమార్ తల, చేతికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అతని స్నేహితు లకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి తండ్రి ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.  కారు డ్రైవర్ మణికొండకు చెందిన షేక్ హనీఫ్ గా విచారణలో తేలిందని వెల్లడించారు.