రెండో రోజూ పెరిగిన బంగారం

08-05-2024 12:34:08 AM

24 క్యారెట్ల తులం ధర రూ.72,380

హైదరాబాద్, మే 7: క్రితం రోజు స్వల్పంగా కోలుకున్న బంగారం ధర మంగళవారం మరింత పెరిగింది. యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లను తగ్గించవచ్చంటూ తాజా అంచనాలు ఏర్పడటంతో ఇన్వెస్టర్లు తిరిగి బంగారం కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో  అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పుత్తడి ధర 2,335 డాలర్ల స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 330 మేర పెరిగి రూ.72,380 వద్దకు చేరిం ది. సోమవారం ఇది రూ.200 పెరిగింది.  బంగారం రెండు వారాల క్రితం రూ. 74,340 వద్దకు చేరి కొత్త రికార్డును సృష్టించిన తర్వాత రూ.71,000 స్థాయికి తగ్గిన సంగతి తెలిసిందే. 22 క్యారట్ల ధర రూ.300 పెరిగి రూ.66,350 వద్ద నిలిచింది.