calender_icon.png 17 July, 2025 | 9:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ నాయకులపై లాఠీ ఛార్జ్ అమానుషం..

26-05-2025 07:27:20 PM

మానకొండూర్ సోషల్ మీడియా ఇంచార్జ్ ఏల శేఖర్ బాబు..

మానకొండూర్ (విజయక్రాంతి): పాలన చేతకాక కేటీఆర్ ఆఫీస్ మీద దాడి చేస్తున్న కాంగ్రెస్ నాయకుల్లారా మీ ఎంపీల ఆఫీస్ లలో ముక్యంగా రాహుల్ గాంధీ ఆఫీస్ లో ప్రధానమంత్రి మోదీ ఫోటో ఉందా అని గుర్తు చేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని మానకొండూరు సోషల్ మీడియా ఇన్చార్జ్ ఏల శేఖర్ బాబు(Ela Shekhar Babu) తీవ్రంగా ఖండించారు.

ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ పాలకులు ఈ విధమైన దాడులను ప్రోత్సహిస్తూ "డైవర్షన్ పాలిటిక్స్" పాల్పడుతూ ప్రజాస్వామ్య విలువలను పాతరేస్తున్నారని ఆయన స్థానిక శాసనసభ్యుడి అధికారిక క్యాంపు కార్యాలయంపై దాడికి దిగిన కాంగ్రెస్ గుండాలను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అత్యుత్సాహం కనబర్చి లాఠీలతో చితకబాదడం శోచనీయమని అని తెలిపారు. క్యాంపు కార్యాలయంపై దాడికి దిగిన కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఏల శేఖర్ బాబు పోలీస్ అధికారులను డిమాండ్ చేశారు.