26-05-2025 07:23:16 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): రైతు సంక్షేమ ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి(Market Chairman Ganta Sanjeeva Reddy) అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ఆగ్రోస్ రైతు కేంద్రంలో 50 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు పంపిణీ కార్యక్రమాన్ని చైర్మన్ చేతుల మీదుగా ప్రారంభించారు.
రైతులు అత్యధికంగా రసాయన ఎరువులను వినియోగం తగ్గించి సేంద్రియ పద్ధతి పాటించి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే విధంగా కృషి చేయాలన్నారు. మండల వ్యవసాయ అధికారి వెంకన్న మాట్లాడుతూ పచ్చి రొట్ట విత్తనాలు కావాల్సిన రైతులు పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ ఏఈఓ లకు అందించి టోకెన్ పొంది తమకు కేటాయించిన షాపుల వద్దకు వెళ్లి జీలుగ విత్తనాలను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, అల్లం నాగేశ్వరరావు, డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, కిసాన్ సెల్ అధ్యక్షుడు తోట వెంకన్న, ఆగ్రోస్ నిర్వాహకులు గోపాల వెంకటరెడ్డి, ఏఈఓ లు రాజేందర్ సాయిచరణ్ రవి వర్మ లావణ్య శ్రీనివాస్ పాల్గొన్నారు.