26-05-2025 07:29:26 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మైసూరు అవధూత దత్త పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 83వ పుట్టినరోజు వేడుకలను మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ దత్త హ్యూమన్ సర్వీసెస్ వాలంటీర్లు, దత్త భక్తుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్, మడూరి లింగమూర్తి, యు. ఏకాంతం, లేగల విజయభాస్కర్ రెడ్డి, యు.వంశీ కుమార్, శీలం శ్రీనివాస్, గుగులోతు విజయ్, పూర్ణ కంటి భాస్కర్, సోమేశ్వర్, కన్న వేణు, పిల్లి సంతోష్, డాక్టర్ సునీల్ కుమార్, ఆగే చిన్న వెంకన్న, రావుల విశ్వేశ్వర్, అక్షయ్, రామ్ తేజ్, సమన్ దత్త, ఆనంద్ దత్త తదితరులు పాల్గొన్నారు.