06-07-2025 12:27:44 AM
వరుణ్‌తేజ్ హీరోగా దర్శకు డు మేర్లపాక గాంధీ ఓ ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వర్కింగ్ టైటిల్ ‘వీటీ15’గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో రితికా నాయక్, సత్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
హైదరాబాద్, అనంతపురం షెడ్యూల్స్ తర్వాత ఈ సినిమా ఇప్పుడు ఫారిన్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. వరుణ్‌తేజ్‌తోపాటు మిగతా ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో టీమ్ వైబ్రెంట్ హంటింగ్ డ్రాప్స్‌లో స్టన్నింగ్ విజువల్స్‌ను షూట్ చేస్తోంది. ఈ షెడ్యూల్‌తో 80 శాతం షూటింగ్ పూర్తవుతుంది.
ఈ సినిమాకు సంబంధించి టైటిల్, గ్లింప్స్‌తోపాటు మరికొన్ని అప్‌డేట్స్‌ను మేకర్స్ త్వరలోనే తెలియజేయనున్నారు. ‘కొరియన్ కనకరాజు’ అనే పేరుతో రానున్నట్టు చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.