calender_icon.png 14 July, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లండన్‌లో కూలిన విమానం

14-07-2025 02:43:05 AM

  1. విమానం కూలడంతో పలు విమానాలు రద్దు
  2. ప్రమాదస్థలిలో అగ్నిగోళంలా మంటలు

లండన్, జూలై 13: ఇంగ్లండ్‌లోని దక్షిణ కోస్తా తీరంలోని సౌత్‌ఎండ్ విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం (స్థానిక కాలమానం ప్రకారం) బీచ్ బీ 200 అనే  చిన్నపాటి విమానం కూలిపోయింది. ఈ ఘటనతో పలు విమానాలను రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు. ఈస్ట్ ఇంగ్లండ్ అంబులెన్స్ సర్వీస్ సంఘటనా స్థలానికి అంబులెన్సులను పంపింది. ఎసెక్స్ కంట్రీ అగ్నిమాపక దళం కూడా సంఘటనా స్థలానికి అగ్నిమాపక యంత్రాలను పంపింది.

సౌత్ ఎండ్, రాయలేగ్ వేర్, బాసిల్‌డాన్ నుంచి సిబ్బందిని విమానాశ్రయానికి పంపారు. ప్రమాద ఘటన నుంచి తెలిసిన వెంటనే స్పందించినట్టు సౌత్ ఎండ్ పశ్చిమ ఎంపీ డేవిడ్ బుర్టాన్ సాంప్‌మాన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సంఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ విమానంలో ఎంత మంది ఉన్న విషయం గురించి అధికారులు ఏం ప్రకటించలేదు.