25-05-2025 05:54:08 PM
ఏపీఎం సాయిలు..
రాజంపేట (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) రాజంపేట మండలం ఆరేపల్లి గ్రామ మహిళ సంగం పరిధిలో నడుస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు 122 మంది రైతులు నుండి 3,752 క్వింట్టాల్ల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అన్నింటిని సీతారామ రైస్ మిల్, శంకధరా రైస్ మిల్ రాజంపేటకు పంపడం జరిగింది. రైతులకు ధాన్యానికి క్వింటాలుకు ప్రభుత్వ మద్దతు ధర 2,320 లకు తీసుకోవడం జరిగిందన్నారు. ఎలాంటి నష్టం, సమస్యలు రాకుండా రైతుల సహకారంతో ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణ పూర్తి చేయడం జరిగిందన్నారు. సెంటర్ నిర్వహణలో గ్రామ మహిళ సంఘం అధ్యక్షురాలు నర్మల రామవ్వ, ఏపిఎం సాయిలు, సిసి రమేష్, వివోఏ సిద్దేశ్వరి, హరీష్, రాములు ట్యాబ్ ఆపరేటర్ విక్కీ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మూసి వేయడం జరిగిందని తెలిపారు.