calender_icon.png 13 May, 2025 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిక

13-05-2025 12:38:15 AM

మునగాల మే 12: సూర్యాపేట జిల్లా  మునగాల మండల కేంద్రము కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జగన్నదపురం గ్రామానికి చెందిన  పలువురు, బి ఆర్ యస్, పార్టీకి చెందినవారు.  యస్. కె రంజాన్, కోడి సింహాద్రి, వెంపటి ఉపేందర్, సీపీఎం, పార్టీకి చెందిన వెంపటి రాములు, వెంపటి యల్లయ్యలకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి  పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం. చేపడుతున్న, అనేక రకాల సంక్షేమ పథకాలకు, ఆకర్షితులై పార్టీలో చేరికలు జరుతున్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని, ప్రతిపక్షాలు, నోటికోచిన్నట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోదాడ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కాసర్ల కోటేశ్వరరావు, సీనియర్ నాయకులు నలమాధ మల్సూర్,  గ్రామశాఖ అధ్యక్షులు, కొమ్ము ఈధారావు,  యల్లవుల మల్లయ్య, యూత్  అధ్యక్షులు తక్కెళ్లపాటి సాయి.  తదితరులు పాల్గొన్నారు.