1 July, 2026 | 6:29 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •   రైతు భరోసా చారిత్రక ఘట్టం.. రైతుల కోసం లక్ష కోట్ల వ్యయం: ఎమ్మెల్యే రాగమయి   •   ఇల్లందు టీడీపీ కార్యకర్తను ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు   •  

చోరీకి గురైన 310 సెల్‌ఫోన్లు రికవరీ

13-05-2025 12:36 AM
  1. ఫోన్ల విలువ రూ. 95 లక్షలు

ఫోన్లను బాధితులకు అందజేసిన క్రైమ్స్ డీసీపీ ఎల్‌సీ నాయక్

శేరిలింగంపల్లి, మే 12 :  సైబరాబాద్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొబైల్స్ ని తిరిగి బాధితులకు అందజేశారు సైబరాబాద్ సిసిఎస్ పోలీసులు. గత 30 రోజులు శ్రమించి మొత్తం 310 ఫోన్లు రికవరీ చేసినట్లు క్రైమ్స్ డీసీపీ ఎల్.సి. నాయక్  తెలిపారు. చోరీ లేదా మిస్ అయిన సెల్ ఫోన్ లోని సిఈఐర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసినట్లు వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ. 95 లక్షలు ఉంటుందన్నారు.

అనంతరం రికవరీ చేసిన సెల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డిజిటల్ అరెస్ట్,ఈజీ మనీ, షేర్స్ లలో పెట్టుబడుల పేరుతో ఆశ చూపించి సైబర్ నేరగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇలాంటి మోసాల గుర్తించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల కాలంలో మొబైల్ మన జీవితంలో ఒక భాగమైందన్నారు.

ఎటిఎం, బ్యాంకుఖాతాలు,సెంటిమెంట్స్,పర్సనల్ సమాచారం,ఎన్నో సేవలు మొబైల్ ద్వారా వినియోగిస్తామన్నారు.సెల్ ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలన్నారు.సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు అమ్మినా,కొన్నా చట్టపరంగా నేరమని తెలిపారు.ఫోన్ల రికవరీలో కీలకంగా వ్యవహరించిన సిసిఎస్ పోలీస్ సిబ్బందిని డీసీపీ ఎల్.సి. నాయక్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో  సీసీఎస్ ఏసీపీ కె. శశాంక్ రెడ్డి, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, మాదాపూర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ సంజీవ్, శంషాబాద్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ పవన్, బాలానగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాజు,మేడ్చల్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ దాలినాయుడు,సోషల్ మీడియా ఎస్‌ఐ శశిధర్ పాల్గొన్నారు.