12 May, 2026 | 12:09 PM

Breaking News

అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో విదేశీ ప్రతినిధులు   •   రెండోసారి అస్సాం సీఎంగా హిమంత బిస్వా శర్మ ప్రమాణస్వీకారం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.. అన్నదాత కు అవగాహన   •   మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •  

విద్యార్థి దశ నుండే నాయకత్వపు లక్షణాలు కలిగి ఉండాలి

30-06-2025 08:31 PM

ఎంఈఓ శైలజ..

లక్షెట్టిపెట (విజయక్రాంతి): విద్యార్థి దశ నుండే నాయకత్వపు లక్షణాలు కలిగి ఉండాలని ఎంఈఓ శైలజ(MEO Shailaja) అన్నారు. సోమవారం ట్రినిటీ పాఠశాల(Trinity High School)లో ఏర్పాటు చేసిన స్టూడెంట్ క్యాబినెట్ కి ముఖ్యఅతిథిగా స్థానిక ఎంఈఓ శైలజ, ఎస్ఐ సురేష్(SI Suresh) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఈవో శైలజ మాట్లాడుతూ... పిల్లలకు ఇప్పటి నుండే నాయకత్వపు, లీడర్స్ లక్షణాలు ఎంతో ముఖ్యమని సూచించారు. చక్కని విద్యతో భవిషత్తు బాగుపడుతుందని అన్నారు.

అనంతరం ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ... పిల్లలు జీవితంలో రాణించాలంటే విద్య చాలా కీలకం అని అన్నారు. విద్యతోనే బంగారు భవిష్యత్తు అని పేర్కొన్నారు. ట్రినిటీ పాఠశాలలో మొత్తం 1400 మంది పిల్లలున్నారని అన్నారు. అందులో నుండి 48 మంది విద్యార్థులను ఎన్నుకున్నామని వీరిలో స్కూల్ లీడర్స్ సైన్స్, మాథ్స్, లాంగ్వేజ్ లీడర్స్, డిసిప్లిన్ స్పోర్ట్స్, క్లాస్ లీడర్స్ గా విద్యార్థులకి బాధ్యతలు అప్పగించమని ట్రినిటీ పాఠశాల ప్రిన్సిపల్ జోసెఫ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ వైస్ ప్రిన్సిపాల్ రాహుల్, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.