08-12-2025 12:32:57 AM
-అన్యాక్రాంతమైన భూములను పరిరక్షించాలి
-ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలి
-బషీర్‌బాగ్ చౌరస్తా నుంచి లోయర్ ట్యాంక్ బండ్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ, నిరసన
-ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, తెలంగాణ లెదర్ ఆర్టిజన్స్ కో -ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు పల్లెల వీరస్వామి
ముషీరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): లీజుకిచ్చిన లిడ్ క్యాప్ భూములను వెంటనే రద్దుచేసి ఆ భూములను చర్మకారుల చెందేట్లు చర్యలు తీసుకోవాలని తెలం గాణ రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, తెలంగాణ లెదర్ ఆర్టిజన్స్ కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు పల్లెల వీరస్వామి, ప్రధాన కార్యదర్శి ములుగు రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆదివారం తెలంగాణ లెదర్ ఆర్టిజన్స్ కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో బషీర్బాగ్ చౌరస్తాలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి లోయర్ ట్యాంక్ బండ్‌లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యా లీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అన్యాక్రాంతమ వుతున్న లిడ్ క్యాప్ భూములను వెంటనే పరిరక్షించాలని డిమాండ్ చేశారు. 1973లో లీడ్ క్యాప్ భూములు ఏర్పడిన సంస్థ అని, 250 ఎకరాలకు ఆనాడు ప్రభుత్వం కేటాయించిందన్నారు. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేదన్నారు.
లిడ్ క్యాప్ భూములను ఒక సామా జిక వర్గానికి ఏర్పాటు చేయాలన్నారు. అన్యాక్రాంతమైన భూ ములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సొసై టీ సలహాదారులు డాక్టర్ ఆరేపల్లి రాజేందర్ డాక్టర్ సిహెచ్. రాజమౌళి, సొసైటీ ఉపాధ్యక్షుడు హమీల్పూర్ రవీందర్, చిట్యాల మొగిలి, చిన్న కొండయ్య, కోశాధికారి పెజ్జంకి రాంబాబు, జాయింట్ సెక్రెటరీ ఓం ప్రకాష్, మడిపల్లి రమేష్, జాన్ దర్శనం, గుమ్మడి సతీష్, దేవర నూమరాజు, గంగారాం శ్యాం తదితరులు పాల్గొన్నారు.