08-12-2025 12:33:24 AM
డాక్టర్ సంగని మల్లేశ్వర్, పాస్ రాష్ట్ర అధ్యక్షులు
వరంగల్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలుకు అడ్డంకిగా మారిన కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఎండగట్టాలని ఫూలే ఆశయ సాధన సమితి (పాస్ ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ పిలుపునిచ్చారు. కాకతీయ విశ్వవిద్యాలయం, జర్నలిజం విభాగంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బలిదానం చేసుకున్న తోలి బహుజన ఉద్యమకారుడు సాయి ఈశ్వరాచారికి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం పాస్ అధ్యక్షులు మల్లేశ్వర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల రిజర్వేషన్లు అమలుకు అడ్డంకిగా న్యాయస్థానాలకు, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న బీసీ వ్యతిరేక విధానాలకు నిరసనగా, రిజర్వేషన్లు అమలు కాకుండానే పంచాయతీ ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ మొండి వైఖరిని తట్టుకోలేక, 94ఏళ్లుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని భరించలేక, ఒంటిపై పెట్రోల్ పోసుకొని బలిదానం చేసుకున్న బీసీ, విశ్వకర్మ బిడ్డ సాయి ఈశ్వరా చారి మరణం బీసీ సమాజాన్ని కలచివేసిందన్నా రు.
నాడు స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం శ్రీకాంత చారి తోలి తెలంగాణ ఉద్యమకారుడు అయితే, అదే సామాజిక వర్గానికి చెందిన సాయి ఈశ్వరా చారి తోలి బహుజన ఉద్యమకారుడని, వారి స్ఫూర్తి వెలకట్టలేనిదని, వారిని కన్న విశ్వకర్మ జాతికి తెలంగాణ ఋణపడి ఉందని కొనియాడారు. తోలి బహుజన ఉద్యమకారుడు సాయి మరణంతో కళ్లుతెరచి,బీసీలు ఐక్యంగా ఉండి,రిజర్వేషన్ల అమలకు కేంద్రంతో పోరాటం చేసే విధంగా కాంగ్రెస్ పై ఒత్తిడి తెవాలని పాస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ విజ్ఞప్తి చేసారు.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిధిగా దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య బి.సురేష్ లాల్ విచ్చేసి మాట్లాడుతూ రిజర్వేషన్స్ సాధన కోసం ఆత్మహత్యలు పరిష్కా రం చూపవని, గాంధేయవాదంతో పోరాడి బీసీలకు న్యాయంగా రావాల్సిన హక్కులను సాధించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ నల్లాని శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు మెరుగు బాబు యాదవ్, జిల్లా కార్యదర్శి గోడిశాల సత్యనారాయణ, పాస్ జిల్లా నాయకులు సాంబమూర్తి, వీరాచారీ, వేమన,కంజర్ల నరసింహ రాములు, ప్రనూప్ తదితరులు రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు.