22 May, 2026 | 8:53 PM

Breaking News

'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2లక్షలకుపైగా జరిమానా   •   భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం   •   ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు తీసుకోవాలి   •   జాన్కంపేట పీటీసీలో ఫైరింగ్ ట్రైనింగ్.. జాగ్రత్త   •   శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •  

భార్యాపిల్లల్ని వదిలేసి ట్రాన్స్‌జెండర్‌తో సహజీవనం

30-07-2025 01:27 AM
  1. విషయం తెలిసి భార్య ఆత్మహత్యాయత్నం
  2. పరిస్థితి విషమంగా ఉందని తెలిసినా ఆస్పత్రికి వెళ్లని భర్త
  3. పోలీసులకు బంధువుల ఫిర్యాదు
  4. జగిత్యాల కేంద్రంలో ఘటన

జగిత్యాల అర్బన్, జూలై 29: జగిత్యాల జిల్లా కేంద్రంలో విచిత్రమైన ఘ టన వెలుగుచూసింది. భార్య, ఇద్దరు పిల్లలను వదిలేసిన వ్యక్తి ఓ ట్రాన్స్‌జెండర్‌తో సహజీవనం చేస్తున్న సంఘటన వెలుగు చూసింది. జగిత్యాల పట్టణానికి చెందిన బింగి రాజశేఖర్‌కు, పెంబట్ల గ్రామానికి చెందిన లాస్యతో 2014లో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ దీపుతో రాజశేఖర్ సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నాడు.

ఈ నేపథ్యంలో భార్య లాస్యను, పిల్లలను వదిలి దీపుతో జగిత్యాలలో సహజీవనం ప్రారంభించాడు. ఈ విషయం తెలిసిన లాస్య మానసికంగా తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. అయితే లాస్య చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఉందని తెలిసినప్పటికీ భార్యను చూడడానికి రాజశేఖర్ హాస్పిటల్‌కు వెళ్లలేదు.

ఆందోళనకు గురైన అత్తమామలు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. తన ఇంట్లోనే ట్రాన్స్‌జెండర్ దీపుతో ఉన్న రాజశేఖర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గదికి తాళం వేసి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు రాజశేఖర్, దీపులను స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించారు.