30-07-2025 01:27:05 AM
- తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్న అధికారులు
- తాజాగా మేడ్చల్‌లో ఫ్యాక్టరీలో పేలుడు, తప్పిన ప్రమాదం
మేడ్చల్, జూలై 29(విజయ క్రాంతి): ఫ్యా క్టరీలలో పనిచేసే కార్మికుల ప్రాణాలు గాల్లో దీపాలుగా తయారయ్యాయి. ఫ్యాక్టరీలలో తరచు ప్రమాదాలు జరగడం వల్ల కార్మికుల కు భద్రత కరువైంది. విధులకు వెళ్లిన కార్మికుడు క్షేమంగా ఇంటికి వచ్చేవరకు కుటుంబీ కులు టెన్షన్ తో ఎదురుచూసే పరిస్థితులు ఉన్నాయి. మేడ్చల్ లోని ఇండస్ట్రియల్ ఏరియాలో నెల రోజుల్లో రెండు ప్రమాదాలు జ రిగాయి. ప్రాణం నష్టం జరగకున్నప్పటికీ కా ర్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు.
నెల రోజుల క్రితం ఒక ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి శ్రీనివాసరెడ్డి అనే కార్మికుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. తాజాగా ఎస్ ఆర్ హెచ్ రబ్బర్ ఫ్యాక్టరీలో పైపులు తయారు చేసే సమయంలో సేఫ్టీ వాల్ పనిచేయకపోవడం తో పేలుడు సంభవించింది. ఆ సమయంలో అక్కడ 20 మంది కార్మికులు పనిచేస్తున్నా రు. పేలుడు సంభవించడంతో పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. పేలుడు తీ వ్రతకు 150 మీటర్ల దూరంలో ఉన్న మరో కంపెనీ పాక్షికంగా దెబ్బతిన్నది. అదృష్టవశా త్తు ప్రాణ నష్టం జరగలేదు.
కానీ ఫ్యాక్టరీ నిర్ల క్ష్యం బహిర్గతమైంది. జిల్లాలో పెద్ద సంఖ్యలో ఫ్యాక్టరీలు ఉన్నాయి. మేజర్ ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. షార్ట్ స ర్క్యూట్, రియాక్టర్లు, బాయిలర్లు పేలడం, మెటీరియల్ తగలబడడం వంటి కారణాలవల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. యాజ మాన్యాల నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగు తున్నాయి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లను పాటించకపోవడం, నిర్వహణ లోపం, ప్ర మాదకర కెమికల్స్, ఎక్విప్మెంట్స్ సరిగా హ్యాండ్లింగ్ చేయకపోవడం, మెషిన్లు, కెమికల్ రియాక్టర్ లపై పూర్తి అవగాహన కలిగిన నిపుణులు లేకపోవడం తదితర కారణాల వ ల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.
కార్మికుల భద్రత కోసం చర్యలు తీసుకోవడంలో కంపెనీలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్లాంట్లను, యం త్రాలను తరచూ నిపుణులతో తనిఖీ చేయించాలి. లోపాలు ఉంటే సరి చేయాలి. ప్రమా దాలు జరిగినప్పుడు ఏమి చేయాలనే శిక్షణ కూడా ఇవ్వాలి. ప్రమాద సమయంలో అవసరమయ్యే మౌలిక సదుపాయాలు, పరికరా లు ఫ్యాక్టరీలో అందుబాటులో ఉండాలి. ఇ లాంటి సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదు.
నామమాత్రంగా తనిఖీలు
ప్రతి ఆరు నెలలకోసారి సంబంధిత అధికారులు పరిశ్రమలను తనిఖీ చేయాలి. భద్ర తా చర్యలు ఏ మేరకు తీసుకుంటున్నారు? అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు తీసుకున్నారా? ఫ్యాక్టరీ మిషన్లు కండిషన్ లో ఉన్నా యా? బాయిలర్లు ఏ విధంగా పనిచేస్తున్నా యి తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలి. కానీ అధికారులు తనిఖీ చేయకుండానే యాజమా న్యాలతో కుమ్మక్కై అన్ని బాగున్నాయని నివేదికలు ఇస్తున్నారు. ఇటీవల సిగాచి పరిశ్ర మ లో జరిగిన ప్రమాద సమయంలో ఈ విష యం బహిర్గతమైంది. ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా అధికారులు కళ్ళు తెరవడం లేదు. మేడ్చల్ లో నెలరోజుల క్రితం ఒక ఫ్యాక్టరీలో పేలుడు సంభవిస్తే చర్యలు తీసుకోలేదు.అధికారులు కార్మికుల భద్రతపై చర్యలు తీసుకోవాలనికోరుతున్నారు.