calender_icon.png 1 January, 2026 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖేడ్ జెడ్పీహెచ్‌ఎస్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు

01-01-2026 02:18:07 AM

పాల్గొన్న జూనియర్ సివిల్ జడ్జి శ్రీధర్ మంథాని 

నారాయణఖేడ్, డిసెంబర్ 31: సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే నేర చరిత్ర లేకుండా, చట్టాలను గౌరవిస్తూ, సమాజ ఉన్నతిని కాంక్షించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జూనియర్ సివిల్ జడ్జ్ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి శ్రీధర్ మంథాని అన్నారు. బుధవారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తమ సమాజ నిర్మాణం కోసం నేటి విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకొని సమాజంలోని నేర ప్రవృత్తిని రూపుమాపాలన్నారు.

ముఖ్యంగా సమాజంలో డ్రంక్ అండ్ డ్రైవ్ , డ్రగ్స్ , సోషల్ మీడియా, సైబర్ క్రైమ్ , ఈవ్ టీజింగ్ ,వరకట్న వేధింపులు  తదితర క్రిమినల్స్ నేరాలు పెరిగాయని వీటి బారిన పడకుండా విద్యార్థులు జాగ్రత్త పడాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి తన జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించడానికి తల్లిదండ్రుల ఆశయ సాధన కోసం, ఉత్తమ సమాజం కోసం, నేర రహిత సమాజం కోసం ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మన్మధ కిషోర్, ఉపాధ్యాయులు రాజశేఖర్, చంద్రశేఖర్ ఆచార్య, హమీద్, జైపాల్ రెడ్డి, సంగ్రామ, భీమ్రావ్ తదితరులు పాల్గొన్నారు.