14-07-2025 04:27:21 PM
మంచిర్యాలకు బస్సు సదుపాయం..
కన్నేపల్లిలో వన మహోత్సవం..
శివ కేశవ ఆలయం ప్రారంభోత్సవం..
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి(MLA Gaddam Vinod Venkataswamy) సుడిగాలి పర్యటన చేశారు. భీమిని, కన్నెపల్లి మండలాల్లో నూతనంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులను సోమవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ప్రారంభించారు. తొలుత ఎమ్మెల్యే కన్నెపల్లిలో పర్యటించారు. కన్నెపల్లి చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనీ బెల్లంపల్లి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. భీమిని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో కూడా వనమోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని గుర్తుచేస్తూ, పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.
బస్సు సర్వీస్ సేవలు ప్రారంభం..
భీమిని మండల ప్రజల చిరకాల బస్సు సర్వీస్ సేవల కోరిక తీరింది. భీమిని మండల కేంద్రం నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రానికి బస్సు సర్వీస్ ను ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ప్రారంభించారు. భీమిని మండల ప్రజలు చిరకాలంగా ఎదురుచూస్తున్న రవాణా సదుపాయం బస్సు ప్రారంభంతో అందుబాటులోకి తెచ్చిన ఘనత బెల్లంపల్లి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి దక్కిందని ప్రజలు ప్రశంసించారు. భీమిని నుండి మంచిర్యాల జిల్లా కేంద్రానికి బస్సు సర్వీస్ ను ప్రారంభించడం ఎంతగానో సంతోషంగా ఉందనీ ఎమ్మెల్యే తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. బస్సు సర్వీస్ తో ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. భీమిని మండలంలోని జగ్గయ్యపేట గ్రామంలో ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన శివకేశవ ఆలయాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.